ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com
గురూజీ

అమృతానంద నాథ

గురువుగారు 1974 సెప్టెంబర్ 19వ తేది వేకువ జామున వినాయక చతుర్థి నాడు  శ్రీమతి కోరిశపాటి హైమావతమ్మ మరియు తిరుపతి రెడ్డి గారి దంపతులకు గౌరవరం గ్రామం, కావలి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించినారు. బాల్యము కౌమారము చాలా ఆనందంగా గడిచిపోయాయి, ద్యాస ఉన్నప్పుడు చదువుతూ మిగతా సమయం అంతా స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడేవారు. చిన్నప్పటి నుండి ధైర్యంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతూ ఉండేవి క్లాసులో లీడర్ గా తరువాత స్కూలు లీడర్ గా ఉంటూ తన స్నేహితులను ముందుకు నడిపించేవారు. స్నేహితులు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయం అంతా ఏకాంతంగా ఉండేదానికే ఆసక్తి చూపించేవారు. అలా ఏకాంతంలో ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టేవి, ఆ ఆలోచనల నుండి తనకు తెలియ


మేము బోధిస్తాము

శ్రీ విద్యా సాధన

శ్రీ అనగా ఐశ్వర్యము, సంపద, సౌభాగ్యము, శుభము మరియు ఆది అంతము లేని పర బ్రహ్మ స్థితి అదియే పరా స్థితి. వీటి గురించి తెలియజేయు జ్ఞానాన్నే "శ్రీ విద్యా” అంటారు. శ్రీ విద్య అనేది వేదాల ఆధారంగా చేయు దైవిక మాతృ ఆరాధన. శ్రీ విద్య ఉపాసన ద్వారా సృష్టి ఎలా సృజించబడిందో, మనము అందులో ఎలా భాగం అవ్వాలో తెలుపుతుంది. సహజ సిద్దంగా మనము సృష్టి స్థితి లయలలో ఏకం అవుతాం, దేనికి బంధీ కాము, ఈ సంసారచక్రం నుండి విముక్తి అవుతాము. శ్రీ విద్య భౌతికంగా భోగాలను ఆథ్యాత్మికంగా ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీ విద్యలో ప్రధాన దేవతగా "లలితా త్రిపుర సుందరి" ని ఆరాధిస్తాము. శ్రీదేవిని వేయి నామాలతో శ్రీ లలితా సహస్రనామంతోను, మూడు వందల నామాలతో త్రిశతి తోను స్తోత్రం చేస్తాము. 

ఇక్కడ నమోదు చేయండి

అమృత నిలయం

మా వీడియోలు

అమృతానంద నాథ ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలు

గురు అమృతానంద నాథ ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలు