ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

శ్రీ మహా గణపతి

గణపతి: గణము అనగా ఒక సమూహము, పతి అనగా భర్త , నాయకుడు, రాజు. అన్నీ గణాలకు అధిపతి గణపతి. ఓంకారమే సాక్షాత్ గణపతి రూపం తీసుకుంది. ఆయన ఎన్నోరూపాలలో ప్రకటమవుతూ ఉంటాడు. శ్రీవిద్య సాంప్రదాయంలో లలితా పరమేశ్వరీ తనయుడుగా శ్రీవల్లభ గణపతి గా తన కార్యాన్నీ నిర్వర్తించాడు.

శ్రీలలితా మహా త్రిపుర సుందరి భండాసురుని యుద్దసమయములో భండాసురుని సోదరుడైన విశుక్రుడు "జయవిఘ్నశిలాయంత్రము" అనే విఘ్నకారణ యంత్రాన్ని శక్తి సేనలపై ప్రయోగించాడు. అప్పుడు మహా కామేశ్వరీ అయిన శ్రీలలితాదేవి మహా కామేశ్వరుని వంక ప్రేమతో చిరునవ్వు నవ్వుతూ చూచింది, ఇరువురి చూపులు ఒకరిలోఒకరు లయం అయినాయి ఆ ఆనంద సమయంలో ఆ చిరునవ్వుల మద్య మహాతేజస్సుతో ఒక కాంతి పుంజం ఆవిర్బవించింది. ఆ కాంతి పుంజం చిన్నగా ఒక దివ్యాకృతిని దరించి శ్రీవల్లభగణపతిగా ఆవిర్బవించినాడు.  

శివ-శక్తి ఏకరూపమే గణపతి. ఈ యుద్దంలో "జయవిఘ్నశిలాయంత్రము" ను ద్వంసం చేసి గజాసురుని సంహరించినాడు.