ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

శ్రీ బాలా త్రిపుర సుందరి

బాలా త్రిపురసుందరి: లలితాదేవి హృదయం నుండి బాలా త్రిపుర సుందరి ఉద్భవించింది. ఈమె ఆధీనంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలు ఉంటాయి.  బాలగా ఉన్నా లలితాదేవికి అంగదేవతగా వ్యక్తమవుతూ శ్రీవిద్యా జ్ఞానాన్ని సర్వలోకాలకు ప్రసరింపజేస్తూ తన కార్యాన్ని నిర్వర్తిస్తూవుంటుంది. బాల అంటేనే మహా పవిత్రకు చిహ్నం. ఈ నామం పలికితేనే చాలు జన్మధన్యమైపోతుంది.

భండాసురునికి 30మంది కుమారులు, తన 30మంది కొడుకులను యుద్దానికి పంపిస్తాడు. భండాసురుని పుత్రులు యుద్దరంగంలో దిగారని తెలిసిన బాలా త్రిపుర సుందరి  తను వారిని ఎదుర్కొటాను అనుమతి ఇవ్వమని తల్లిని ప్రాదేయపడింది, మొదట తల్లి వద్దని వారించినా తరువాత తన పుత్రిక ఉత్సాహాన్ని కాదనలేక  సమ్మతించినది. బాలా కర్ణి అనే నూరు హంసలు లాగుతున్న రధాన్ని అధిరోహించి, శ్యమలా, వారాహి అంగరక్షకులుగా, యుద్దభూమికి బయలుదేరింది. బాలాదేవి భండపుత్రులతో చేయు అతిభయంకరమైనన పోరాటం చూసి అందరు ఆశ్చర్యపోయారు. బాలాదేవి 30 మందీ భండపుత్రులను ఏకకాలంలో సంహరించింది. బిడ్డ పోరాటనికి మురిసిపోయిన తల్లి ఆనందంతో కౌగిలించుకున్నది. బాలగా కనిపిస్తున్నా శక్తిలో తల్లిబిడ్డ అభేదం.