ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

శ్రీ మహా వారాహి దేవి

లలితాదేవి దండనాదయే వారాహి దేవి, ఈవిడ లలితాదేవి క్రియాశక్తి  నుండి ఆవిర్భవించి లలితాదేవి ఎడమ ప్రక్కన వచ్చినిల్చుంది. వారాహిదేవికి లలితాదేవి తన ఆజ్ణాచక్రం నుండి హలము, ముసలం ఆయుధాలను ప్రసాదించి సైన్యాద్యక్షురాలిగా ప్రకటించింది. అమ్మవారి క్రియాశక్తే వారాహి దేవి.

వరాహముఖముతో, పద్మమురేకుల వంటి కన్నులతో, హలము(నాగలి), ముసలం(రోకలి),శంఖం, చక్రం,అంకుశం, పాశము మొదలైన ఆయుధములు ధరించి అభయ, వరద ముద్రలతో నిండైన స్తనములతో ఎర్రని వస్త్రము ధరించి హద్దులు లేని కరుణతో ప్రకశిస్తూ ఉంటుంది. జగత్తును ఆజ్ఞాపించే అమ్మవారి ఆజ్ఞాశక్తియే వారాహిదేవి.

అమ్మవారు శ్రీ చక్రం నుండి రెండు చక్రాలను తీసి ఒకటి శ్యామలాదేవికి మరోకటి వారాహీ దేవికి ఇచ్చినది. వారాహి దేవి కి ఇచ్చిన చక్రం పేరు " కిరిచక్రం". కిరిచక్రానికి ఐదు ఆవరణలు ఉంటాయి. వారాహి దేవి తన ఆవరణదేవతలతోటి మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూఉంటుంది. అష్టమాతృకలలో కూడ వారాహిదేవి పంచమస్థానములో కొలువైఉంది. అందుకే పంచమి అనికూడా పిలుస్తారు

శ్రీ మహా వారాహి ద్వాదశ నామాలు:

1) పంచమి, 2) దండనాధ, 3) సంకేత,

4) సమయేశ్వరి, 5) సమయసంకేత, 6) వారాహి, 7) పోత్రిని, 8) శివా, 9) వార్తాళి,

10) మహాసేన, 11) ఆఙ్ఞాచక్రేశ్వరి, 12) అరిఘ్ని

వారాహి దేవి అంగదేవతలు:

అంగదేవత: లఘు వారాహిదేవి 

ఉపాంగ దేవత:  స్వప్న వారాహిదేవి

ప్రత్యంగ దేవత: తిరస్కారిణిదేవి

ఈవిడ గురించి ఇంకా వివరంగా సాదనలో తెలుసుకొందాం.