అత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో
జాతః శిష్యనిబంధతంద్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా ।
దృష్టో భక్తతమేన హేహయమహీపాలేన తస్మై వరా-
నష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిథ స్వేనైవ చాంతే వధమ్ ॥1॥

సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్ఛక్తిమాత్రానతం
బ్రహ్మద్వేషి తదాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరమ్ ।
సంజాతో జమదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే
రామో నామ తదాత్మజేష్వవరజః పిత్రోరధాః సమ్మదమ్ ॥2॥

లబ్ధామ్నాయగణశ్చతుర్దశవయా గంధర్వరాజే మనా-
గాసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులస్యాజ్ఞయా ।
తాతాజ్ఞాతిగసోదరైః సమమిమాం ఛిత్వాఽథ శాంతాత్ పితు-
స్తేషాం జీవనయోగమాపిథ వరం మాతా చ తేఽదాద్వరాన్ ॥3॥

పిత్రా మాతృముదే స్తవాహృతవియద్ధేనోర్నిజాదాశ్రమాత్
ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిమ్ ।
లబ్ధ్వా తత్పరశుం తదుక్తదనుజచ్ఛేదీ మహాస్త్రాదికం
ప్రాప్తో మిత్రమథాకృతవ్రణమునిం ప్రాప్యాగమః స్వాశ్రమమ్ ॥4॥

ఆఖేటోపగతోఽర్జునః సురగవీసంప్రాప్తసంపద్గణై-
స్త్వత్పిత్రా పరిపూజితః పురగతో దుర్మంత్రివాచా పునః ।
గాం క్రేతుం సచివం న్యయుంక్త కుధియా తేనాపి రుంధన్ముని-
ప్రాణక్షేపసరోషగోహతచమూచక్రేణ వత్సో హృతః ॥5॥

శుక్రోజ్జీవితతాతవాక్యచలితక్రోధోఽథ సఖ్యా సమం
బిభ్రద్ధ్యాతమహోదరోపనిహితం చాపం కుఠారం శరాన్ ।
ఆరూఢః సహవాహయంతృకరథం మాహిష్మతీమావిశన్
వాగ్భిర్వత్సమదాశుషి క్షితిపతౌ సంప్రాస్తుథాః సంగరమ్ ॥6॥

పుత్రాణామయుతేన సప్తదశభిశ్చాక్షౌహిణీభిర్మహా-
సేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభితాయోధనః ।
సద్యస్త్వత్కకుఠారబాణవిదలన్నిశ్శేషసైన్యోత్కరో
భీతిప్రద్రుతనష్టశిష్టతనయస్త్వామాపతత్ హేహయః ॥7॥

లీలావారితనర్మదాజలవలల్లంకేశగర్వాపహ-
శ్రీమద్బాహుసహస్రముక్తబహుశస్త్రాస్త్రం నిరుంధన్నముమ్ ।
చక్రే త్వయ్యథ వైష్ణవేఽపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా
ధ్యాయంతం ఛితసర్వదోషమవధీః సోఽగాత్ పరం తే పదమ్ ॥8॥

భూయోఽమర్షితహేహయాత్మజగణైస్తాతే హతే రేణుకా-
మాఘ్నానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ ।
ధ్యానానీతరథాయుధస్త్వమకృథా విప్రద్రుహః క్షత్రియాన్
దిక్చక్రేషు కుఠారయన్ విశిఖయన్ నిఃక్షత్రియాం మేదినీమ్ ॥9॥

తాతోజ్జీవనకృన్నృపాలకకులం త్రిస్సప్తకృత్వో జయన్
సంతర్ప్యాథ సమంతపంచకమహారక్తహృదౌఘే పితృన్
యజ్ఞే క్ష్మామపి కాశ్యపాదిషు దిశన్ సాల్వేన యుధ్యన్ పునః
కృష్ణోఽముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్ ॥10॥

న్యస్యాస్త్రాణి మహేంద్రభూభృతి తపస్తన్వన్ పునర్మజ్జితాం
గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వార్థితస్తాపసైః ।
ధ్యాతేష్వాసధృతానలాస్త్రచకితం సింధుం స్రువక్షేపణా-
దుత్సార్యోద్ధృతకేరలో భృగుపతే వాతేశ సంరక్ష మామ్ ॥11॥