రాగం: గానమూర్తి
తాళం: ఆది

పల్లవి
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి (గా)

అను పల్లవి
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య (గా)

చరణము(లు)
నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ (గా)