రాగం: శ్రీ
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ॥ (2.5)

చరణం 1
తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద । (2)
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను ॥ (1.5)
తిరువీథుల మెఱసీ… (1.5)

చరణం 2
గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద ॥ (2)
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుర్రమెనిమిదోనాడు ॥ (1.5)
తిరువీథుల మెఱసీ… (1.5)

చరణం 3
కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట । (2)
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్​మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ॥ (1.5)

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను ॥ (2.5)