రాగం: శుద్ధ ధన్యాసి
ఆ: గ2 మ1 ప ని2 ప స
అవ: స ని2 ప మ1 గ2 స
తాళం: ఆది
పల్లవి
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ॥ (2.5)
చరణం 1
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ । (2)
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ । (2)
వినరో భాగ్యము… (1.5)
చరణం 2
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ । (2)
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ ॥
వినరో భాగ్యము… (1.5)
చరణం 3
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ । (2)
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ ॥ (2)
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ ॥ (2.5)