రాగం: ధీర శంకరాభరణం
అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమంగ ॥
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే ।
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ॥
మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే ।
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ॥
చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే ।
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ॥