దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !
పాడిపంటలుపొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !
ఈసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్డుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకులు నమ్మవెలె నోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !
వెనుక చూసిన కార్యమేమోయ్
మంచిగతమున కొంచమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుక పడితే వెనుకేనోయ్ !
పూను స్పర్దను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్ !
దేశాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చేసె నోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్ల లోయి !
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయ్ !
చెట్ట పట్టాల్ పట్టుకుని
దేశస్తు లంతా నడవవలె నోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలె నోయి !
మతం వేరైతేను యేమోయి
మనసు వొకటై మనుషులుంటే
జాతియన్నది లేచి పెరిగీ
లోకమున రాణించు నోయి !
దేశ మనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలె నోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలె నోయి !
ఆకులందున అణగి మణగీ
కవిత పలకవలె నోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయి !
దేశమును ప్రేమించుమన్నDownload PDF
Related Posts
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
పల్లవిచక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగునన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగుచదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు ॥చ॥ చరణం1హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు…
Read moreగోపాల కృష్ణ దశావతారం
మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెద నాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణనరసింహావతారుడనెద వాయువేగ రథమునియ్యవేఓయమ్మ నన్ను వామనవతారుడనవే…
Read more