ఏవం చతుర్దశజగన్మయతాం గతస్య
పాతాలమీశ తవ పాదతలం వదంతి ।
పాదోర్ధ్వదేశమపి దేవ రసాతలం తే
గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్ ॥1॥
జంఘే తలాతలమథో సుతలం చ జానూ
కించోరుభాగయుగలం వితలాతలే ద్వే ।
క్షోణీతలం జఘనమంబరమంగ నాభి-
ర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే ॥2॥
గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు
ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యమ్ ।
ఏవం జగన్మయతనో జగదాశ్రితైర-
ప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే ॥3॥
త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద
ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశాః ।
ఉల్లాసిచిల్లియుగలం ద్రుహిణస్య గేహం
పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రై ॥4॥
నిశ్శేషవిశ్వరచనా చ కటాక్షమోక్షః
కర్ణౌ దిశోఽశ్వియుగలం తవ నాసికే ద్వే ।
లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ
తారాగణాశ్చ దశనాః శమనశ్చ దంష్ట్రా ॥5॥
మాయా విలాసహసితం శ్వసితం సమీరో
జిహ్వా జలం వచనమీశ శకుంతపంక్తిః ।
సిద్ధాదయః స్వరగణా ముఖరంధ్రమగ్ని-
ర్దేవా భుజాః స్తనయుగం తవ ధర్మదేవః ॥6॥
పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనః సుధాంశు –
రవ్యక్తమేవ హృదయంబుజమంబుజాక్ష ।
కుక్షిః సముద్రనివహా వసనం తు సంధ్యే
శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః ॥7॥
శ్రోణీస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే
హస్త్యుష్ట్రసైంధవముఖా గమనం తు కాలః ।
విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు-
చారూరుయుగ్మచరణం కరుణాంబుధే తే ॥8॥
సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే
వీర్యం మహాసురగణోఽస్థికులాని శైలాః ।
నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ
జీయాదిదం వపురనిర్వచనీయమీశ ॥9॥
ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం
కర్మావసానసమయే స్మరణీయమాహుః ।
తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే
వాతాలయాధిప నమోఽస్తు నిరుంధి రోగాన్ ॥10॥