కేశపాశధృతపింఛికావితతిసంచలన్మకరకుండలం
హారజాలవనమాలికాలలితమంగరాగఘనసౌరభమ్ ।
పీతచేలధృతకాంచికాంచితముదంచదంశుమణినూపురం
రాసకేలిపరిభూషితం తవ హి రూపమీశ కలయామహే ॥1॥
తావదేవ కృతమండనే కలితకంచులీకకుచమండలే
గండలోలమణికుండలే యువతిమండలేఽథ పరిమండలే ।
అంతరా సకలసుందరీయుగలమిందిరారమణ సంచరన్
మంజులాం తదను రాసకేలిమయి కంజనాభ సముపాదధాః ॥2॥
వాసుదేవ తవ భాసమానమిహ రాసకేలిరససౌరభం
దూరతోఽపి ఖలు నారదాగదితమాకలయ్య కుతుకాకులా ।
వేషభూషణవిలాసపేశలవిలాసినీశతసమావృతా
నాకతో యుగపదాగతా వియతి వేగతోఽథ సురమండలీ ॥3॥
వేణునాదకృతతానదానకలగానరాగగతియోజనా-
లోభనీయమృదుపాదపాతకృతతాలమేలనమనోహరమ్ ।
పాణిసంక్వణితకంకణం చ ముహురంసలంబితకరాంబుజం
శ్రోణిబింబచలదంబరం భజత రాసకేలిరసడంబరమ్ ॥4॥
స్పర్ధయా విరచితానుగానకృతతారతారమధురస్వరే
నర్తనేఽథ లలితాంగహారలులితాంగహారమణిభూషణే ।
సమ్మదేన కృతపుష్పవర్షమలమున్మిషద్దివిషదాం కులం
చిన్మయే త్వయి నిలీయమానమివ సమ్ముమోహ సవధూకులమ్ ॥5॥
స్విన్నసన్నతనువల్లరీ తదను కాపి నామ పశుపాంగనా
కాంతమంసమవలంబతే స్మ తవ తాంతిభారముకులేక్షణా ॥
కాచిదాచలితకుంతలా నవపటీరసారఘనసౌరభం
వంచనేన తవ సంచుచుంబ భుజమంచితోరుపులకాంకురా ॥6॥
కాపి గండభువి సన్నిధాయ నిజగండమాకులితకుండలం
పుణ్యపూరనిధిరన్వవాప తవ పూగచర్వితరసామృతమ్ ।
ఇందిరావిహృతిమందిరం భువనసుందరం హి నటనాంతరే
త్వామవాప్య దధురంగనాః కిము న సమ్మదోన్మదదశాంతరమ్ ॥7॥
గానమీశ విరతం క్రమేణ కిల వాద్యమేలనముపారతం
బ్రహ్మసమ్మదరసాకులాః సదసి కేవలం ననృతురంగనాః ।
నావిదన్నపి చ నీవికాం కిమపి కుంతలీమపి చ కంచులీం
జ్యోతిషామపి కదంబకం దివి విలంబితం కిమపరం బ్రువే ॥8॥
మోదసీమ్ని భువనం విలాప్య విహృతిం సమాప్య చ తతో విభో
కేలిసమ్మృదితనిర్మలాంగనవఘర్మలేశసుభగాత్మనామ్ ।
మన్మథాసహనచేతసాం పశుపయోషితాం సుకృతచోదిత-
స్తావదాకలితమూర్తిరాదధిథ మారవీరపరమోత్సవాన్ ॥9॥
కేలిభేదపరిలోలితాభిరతిలాలితాభిరబలాలిభిః
స్వైరమీశ నను సూరజాపయసి చారునామ విహృతిం వ్యధాః ।
కాననేఽపి చ విసారిశీతలకిశోరమారుతమనోహరే
సూనసౌరభమయే విలేసిథ విలాసినీశతవిమోహనమ్ ॥10॥
కామినీరితి హి యామినీషు ఖలు కామనీయకనిధే భవాన్
పూర్ణసమ్మదరసార్ణవం కమపి యోగిగమ్యమనుభావయన్ ।
బ్రహ్మశంకరముఖానపీహ పశుపాంగనాసు బహుమానయన్
భక్తలోకగమనీయరూప కమనీయ కృష్ణ పరిపాహి మామ్ ॥11॥