Print Friendly, PDF & Email

శ్రీకృష్ణ త్వత్పదోపాసనమభయతమం బద్ధమిథ్యార్థదృష్టే-
ర్మర్త్యస్యార్తస్య మన్యే వ్యపసరతి భయం యేన సర్వాత్మనైవ ।
యత్తావత్ త్వత్ప్రణీతానిహ భజనవిధీనాస్థితో మోహమార్గే
ధావన్నప్యావృతాక్షః స్ఖలతి న కుహచిద్దేవదేవాఖిలాత్మన్ ॥1॥

భూమన్ కాయేన వాచా ముహురపి మనసా త్వద్బలప్రేరితాత్మా
యద్యత్ కుర్వే సమస్తం తదిహ పరతరే త్వయ్యసావర్పయామి ।
జాత్యాపీహ శ్వపాకస్త్వయి నిహితమనఃకర్మవాగింద్రియార్థ-
ప్రాణో విశ్వం పునీతే న తు విముఖమనాస్త్వత్పదాద్విప్రవర్యః ॥2॥

భీతిర్నామ ద్వితీయాద్భవతి నను మనఃకల్పితం చ ద్వితీయం
తేనైక్యాభ్యాసశీలో హృదయమిహ యథాశక్తి బుద్ధ్యా నిరుంధ్యామ్ ।
మాయావిద్ధే తు తస్మిన్ పునరపి న తథా భాతి మాయాధినాథం
తం త్వాం భక్త్యా మహత్యా సతతమనుభజనీశ భీతిం విజహ్యామ్ ॥3॥

భక్తేరుత్పత్తివృద్ధీ తవ చరణజుషాం సంగమేనైవ పుంసా-
మాసాద్యే పుణ్యభాజాం శ్రియ ఇవ జగతి శ్రీమతాం సంగమేన ।
తత్సంగో దేవ భూయాన్మమ ఖలు సతతం తన్ముఖాదున్మిషద్భి-
స్త్వన్మాహాత్మ్యప్రకారైర్భవతి చ సుదృఢా భక్తిరుద్ధూతపాపా ॥4॥

శ్రేయోమార్గేషు భక్తావధికబహుమతిర్జన్మకర్మాణి భూయో
గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయతః ప్రద్రుతం ప్రద్రుతాత్మా ।
ఉద్యద్ధాసః కదాచిత్ కుహచిదపి రుదన్ క్వాపి గర్జన్ ప్రగాయ-
న్నున్మాదీవ ప్రనృత్యన్నయి కురు కరుణాం లోకబాహ్యశ్చరేయమ్ ॥5॥

భూతాన్యేతాని భూతాత్మకమపి సకలం పక్షిమత్స్యాన్ మృగాదీన్
మర్త్యాన్ మిత్రాణి శత్రూనపి యమితమతిస్త్వన్మయాన్యానమాని ।
త్వత్సేవాయాం హి సిద్ధ్యేన్మమ తవ కృపయా భక్తిదార్ఢ్యం విరాగ-
స్త్వత్తత్త్వస్యావబోధోఽపి చ భువనపతే యత్నభేదం వినైవ ॥6॥

నో ముహ్యన్ క్షుత్తృడాద్యైర్భవసరణిభవైస్త్వన్నిలీనాశయత్వా-
చ్చింతాసాతత్యశాలీ నిమిషలవమపి త్వత్పదాదప్రకంపః ।
ఇష్టానిష్టేషు తుష్టివ్యసనవిరహితో మాయికత్వావబోధా-
జ్జ్యోత్స్నాభిస్త్వన్నఖేందోరధికశిశిరితేనాత్మనా సంచరేయమ్ ॥7॥

భూతేష్వేషు త్వదైక్యస్మృతిసమధిగతౌ నాధికారోఽధునా చే-
త్త్వత్ప్రేమ త్వత్కమైత్రీ జడమతిషు కృపా ద్విట్సు భూయాదుపేక్షా ।
అర్చాయాం వా సమర్చాకుతుకమురుతరశ్రద్ధయా వర్ధతాం మే
త్వత్సంసేవీ తథాపి ద్రుతముపలభతే భక్తలోకోత్తమత్వమ్ ॥8॥

ఆవృత్య త్వత్స్వరూపం క్షితిజలమరుదాద్యాత్మనా విక్షిపంతీ
జీవాన్ భూయిష్ఠకర్మావలివివశగతీన్ దుఃఖజాలే క్షిపంతీ ।
త్వన్మాయా మాభిభూన్మామయి భువనపతే కల్పతే తత్ప్రశాంత్యై
త్వత్పాదే భక్తిరేవేత్యవదదయి విభో సిద్ధయోగీ ప్రబుద్ధః ॥9॥

దుఃఖాన్యాలోక్య జంతుష్వలముదితవివేకోఽహమాచార్యవర్యా-
ల్లబ్ధ్వా త్వద్రూపతత్త్వం గుణచరితకథాద్యుద్భవద్భక్తిభూమా ।
మాయామేనాం తరిత్వా పరమసుఖమయే త్వత్పదే మోదితాహే
తస్యాయం పూర్వరంగః పవనపురపతే నాశయాశేషరోగాన్ ॥10॥