మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరా
కటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥

ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురా
అందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥

మతసమైక్యతా నినాదమే మనకు బలమురా
గతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ॥

ఉదయోజ్వల భాస్కర కిరణోదంచితమురా నభం
భువన మానవాభ్యుదయ విజయమదే మనకు శుభమ్ ॥