రాగం: అమృతవాహినీ
తాళం: ఆది
పల్లవి
శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే
అనుపల్లవి
వారిజ భవ సనక సనందన
వాసవాది నారదులెల్ల పూజించే (శ్రీ)
చరనం
దారిని శిలయై తాపము తాళక
వారము కన్నీరును రాల్చగ
శూర అహల్యను జూచి బ్రోచితివి
ఆ రీతి ధన్యు సేయవే త్యాగరాజ గేయమా (శ్రీ)