లలితాదేవి మంత్రిణియే శ్యామలాదేవి, ఈవిడ లలితాదేవి బుద్ధి నుండి ఆవిర్భవించి చేతిలో చిలుక, వీణలతో లలితాదేవి కుడిప్రక్కన వచ్చినిల్చుంది. అమ్మవారి ఙ్ఞానశక్తే శ్యామలాదేవి.
అమ్మవారు శ్రీ చక్రం నుండి రెండు చక్రాలను తీసి ఒకటి శ్యామలాదేవికి మరోకటి వారాహీ దేవికి ఇచ్చినది. శ్యామలదేవికి ఇచ్చిన చక్రం పేరు "గేయచక్రం". అమ్మవారు శ్యామలాదేవికి తన వేలిఉంగరాన్ని తొడిగి తన రాజ్యానికి మంత్రిణిగా ప్రకటించినది. ఈవిడే ఇక్కడ మంత్రిగాను, దశమహావిద్యలలో 9వ విద్య మాతంగి మహావిద్యగాను ప్రకటితమవుతూఉంటుంది.
గేయచక్రానికి ఏడు ఆవరణలు ఉంటాయి. శ్యామలాదేవి తన ఆవరణదేవతలతోటి మనల్ని ఎల్లవేళలా పాలిస్తూఉంటుంది.
శ్యామలాదేవి అంగదేవతలు:
అంగదేవత: లఘుశ్యామలదేవి
ఉపాంగ దేవత: వాగ్వాదినిదేవి
ప్రత్యంగ దేవత: నకులేశ్వరిదేవి
ఈవిడ గురించి ఇంకా వివరంగా సాదనలో తెలుసుకొందాం.