ఏవైనా ప్రశ్నలు?    +91 9493475515 | amritanilayam.gowravaram@gmail.com

శ్రీ విద్య అంటే ఏమిటి?

శ్రీ అనగా ఐశ్వర్యము, సంపద, సౌభాగ్యము, శుభము మరియు ఆది అంతము లేని పర బ్రహ్మ స్థితి అదియే పరా స్థితి. వీటి గురించి తెలియజేయు జ్ఞానాన్నే "శ్రీ విద్యా” అంటారు. శ్రీ విద్య అనేది వేదాల ఆధారంగా చేయు దైవిక మాతృ ఆరాధన. శ్రీ విద్య ఉపాసన ద్వారా సృష్టి ఎలా సృజించబడిందో, మనము అందులో ఎలా భాగం అవ్వాలో తెలుపుతుంది. సహజ సిద్దంగా మనము సృష్టి స్థితి లయలలో ఏకం అవుతాం, దేనికి బంధీ కాము, ఈ సంసారచక్రం నుండి విముక్తి అవుతాము. శ్రీ విద్య భౌతికంగా భోగాలను ఆథ్యాత్మికంగా ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీ విద్యలో ప్రధాన దేవతగా "లలితా త్రిపుర సుందరి" ని ఆరాధిస్తాము. శ్రీదేవిని వేయి నామాలతో శ్రీ లలితా సహస్రనామంతోను, మూడు వందల నామాలతో త్రిశతి తోను స్తోత్రం చేస్తాము. ఆమెను " శ్రీ యంత్రం " లేదా "శ్రీ చక్రం" రూపంలో పూజిస్తారు. ఈ శరీరమే శ్రీ చక్రం, శ్రీచక్ర మే బ్రహ్మాండము అనగా ఈ పిండడానికి, బ్రహ్మాండానికి శ్రీ చక్రం ప్రతీక. ఏ ఆధ్యాత్మిక విద్యకై నా అంతిమ లక్షం తనను తాను తెలుసుకోవడం, అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటిలొ అత్యుత్తమ మార్గం శ్రీవిద్యయే.

శ్రీ విద్యలో 4 మార్గాలు ఉన్నాయి

1. సమయాచారము - భావన ప్రధానంగా

2. దక్షణాచారము - మూర్తి (లేక) యంత్ర ప్రధానంగా

3. కౌళాచారము - పై రెండు మరియు దేహమే దేవాలయం, జీవుడే దేవుడు

4. వామాచారము - శక్తి ప్రధానంగా

మనము ఈ గురు పరంపరలో సమయాచారము, దక్షణాచారము మరియు కౌళాచారము ఈ మూడు మార్గములకు అర్హత కలిగివున్నాము. ఎవరికి ఇష్టమైన మార్గమును వారు అనుసరించి ఆ జగన్మాతలో లీనమౌదాము.

శ్రీ విద్య సాధన:

• శ్రీ మహా గణపతి

• శ్రీ బాలా త్రిపుర సుందరి

• శ్రీ రాజ శ్యామల

• శ్రీ మహా వారాహి

• శ్రీ లలితా త్రిపుర సుందరి

(శ్రీచక్రోపాసన లేదా శ్రీ చక్ర నవావరణ పూజ)

రోజు ఈవెంట్‌లు:

4:00 a.m. – 6:00 a.m.– నవావరణ పూజ

6:00 a.m. – 8:30 a.m. – శ్రీ విద్య విశేష హోమం

9:00 a.m. – 12:00 p.m. – గణపతి / శ్యామ / వారాహి యంత్ర పూజలు / శ్రీ చక్ర నవావరణ పూజ

6:00 p.m. – 8:00 p.m. – సత్సంగ్.